రోబోలకు బందీలుగా రష్యన్ సైనికులు..
రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి.
- ప్రపంచంలో ఇదే మొదటిసారి: ఉక్రెయిన్
కీవ్, జూలై 14: రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి.
తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్గీవ్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. భూమి మీద సాగించే యుద్ధంలో రిమోట్ సాయంతో నడిచే రోబోలు సైనికులుగా మారి శత్రు సైనికులను బంధించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ని ఉక్రెయిన్‌కి చెందిన ఎలైట్ థర్డ్ సెపరేట్ అసాల్ట్ బ్రిగేడ్ నిర్వహించింది. యుద్ధ రంగంలోకి చేరుకున్న రెండు రోబోలు రష్యన్ బంకర్‌పై దాడి చేసి బాంబులతో పేల్చివేశాయి. దీంతో రష్యన్ సైనికులు రోబోలకు లొంగిపోయారని ఉక్రెయిన్ సాయుధ దళం తెలిపింది.
వారిని డ్రోన్ల పర్యవేక్షణలో ఉక్రెయిన్ భూభాగంలోకి తరలించినట్లు పేర్కొన్నది. అప్రత్యక్ష యుద్ధంలో సైనికులకు బదులుగా రోబోలను రంగంలోకి దించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన డ్రోన్, రోబోటిక్స్ కార్యక్రమాన్ని వేగంగా విస్తరించిందనడానికి తాజా పరిణామమే సాక్ష్యం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

