ఉక్రెయిన్ పౌరుడిని చంపినందుకు… రష్యా సైనికుడికి జీవిత ఖైదు
కీవ్: నిరాయుధుడైన ఉక్రెయిన్ పౌరుడిని చంపిన రష్యా సైనికుడికి ఉక్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రష్యన్ ఆర్మీ ట్యాంక్ కమాండర్, 21 ఏళ్ల సార్జెంట్ వాడిమ్ షిషిమరిన్, ఫిబ్రవరి 28న ఈశాన్య ఉక్రేనియన్ గ్రామమైన చుపాఖివ్కాలో కారులో వెళ్తున్న 62 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపాడు. రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు నిరాయుధుడైన ఆ వృద్ధుడి తలపై గన్‌తో కాల్పులు జరిపాడు.
మరోవైపు ఉక్రెయిన్ ఆర్మీకి చిక్కిన ఈ రష్యా సైనికుడు సార్జెంట్ వాడిమ్ షిషిమరిన్ యుద్ధ నేరాలపై కీవ్‌లోని ఆ దేశ కోర్టు విచారణ జరిపింది. నిరాయుధుడైన వృద్ధుడ్ని కాల్చి చంపిన నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. దీంతో న్యాయమూర్తి సెర్హి అగాఫోనోవ్ రష్యా సైనికుడికి జీవిత కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం తీర్పు వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడిని రష్యా ప్రారంభించింది. అయితే రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్ కోర్టు ఒక రష్యా సైనికుడికి తొలిసారి ఈ మేరకు శిక్ష విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

