లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య.. స్పష్టం చేసిన పుతిన్
మాస్కో : లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు.
సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ చర్యలన్నీ డాన్బాస్ వాసులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఉన్నామని, ఇది తమ కర్తవ్యమని.. ఈ లక్ష్యాన్ని సాధించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వివిధ పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో రష్యా తన సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేసిందని పునరుద్ఘాటించారు. పాశ్చాత్య ఆర్థిక, సాంకేతిక దాడికి ప్రతి స్పందించామని, తాము ఏమీ కోల్పోలేదన్నారు.
ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఉబ్జెకిస్థాన్‌లో సమావేశం కానున్నారు. ఈ నెల 15-16 తేదీల్లో ఉబ్జెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమవుతారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రీ డెనిసోవ్ తెలిపారు. ఇంతకు ముందు ఉక్రెయిన్‌కు రష్యా సైన్యాన్ని పంపే ముందు ఇద్దరు నేతలు బీజింగ్‌లో సమావేశమయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

