Russian Man | యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. 14 ఏండ్లుగా ఆమెపై లైంగిక దాడి
Russian Man | ఒక వ్యక్తి (Russian Man) యువతిని కిడ్నాప్ చేశాడు. 14 ఏండ్లుగా ఆమెను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. చివరకు ఆ వ్యక్తి తల్లి సహాయంతో తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మరో మహిళను కూడా నిర్బంధించిన నిందితుడు కొన్నేండ్ల కిందట ఆమెను హత్య చేశాడని చెప్పింది.
మాస్కో: ఒక వ్యక్తి (Russian Man) యువతిని కిడ్నాప్ చేశాడు. 14 ఏండ్లుగా ఆమెను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. చివరకు ఆ వ్యక్తి తల్లి సహాయంతో తప్పించుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మరో మహిళను కూడా నిర్బంధించిన నిందితుడు కొన్నేండ్ల కిందట ఆమెను హత్య చేశాడని చెప్పింది. రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం 51 ఏండ్ల వయసున్న వ్లాదిమిర్ చెస్కిడోవ్, 2009లో 19 ఏండ్ల యువతిని డ్రింక్ కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. నాటి నుంచి ఆమెను తన ఇంట్లో నిర్బంధించాడు. 14 ఏండ్లుగా లైంగిక బానిసగా వాడుకున్నాడు. వెయ్యిసార్లకుపైగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె పారిపోకుండా బెడ్ రూమ్‌లో నిర్బంధించాడు.
కాగా, వ్లాదిమిర్ ఇటీవల మానసిక అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 33 ఏండ్ల వయసున్న బాధిత మహిళ ఆ ఇంటి నుంచి తప్పించుకున్నది. వ్లాదిమిర్ తల్లి కూడా ఆమెకు సహకరించింది. అనంతరం బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. 14 ఏండ్లుగా తనను నిర్బంధించి లైంగిక బానిసగా వాడుకున్నాడని వ్లాదిమిర్‌పై ఫిర్యాదు చేసింది. అతడు మరో మహిళను కూడా చాలా కాలం నిర్బంధించినట్లు తెలిపింది. 2011లో ఘర్షణ జరుగడంతో ఆమెను హత్య చేశాడని చెప్పింది.
మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదుపై రష్యా పోలీసులు స్పందించారు. వ్లాదిమిర్ ఇంటిని పూర్తిగా సోదా చేశారు. లైంగిక టాయిస్, అశ్లీల సీడీలు, ఇతర పరికారాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి ఇంటి బేస్మెంట్ వద్ద మనిషి అవశేషాలను కనుగొన్నారు. కిడ్నాప్, హత్య, లైంగిక దాడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడ్ని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Kidnap
- Russian Man
- slave
- Teen
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

