Russian Attack: రష్యా దాడిలో 9 మంది మృతి.. మంటల్లో కీవ్ చర్చి
Russian Attack: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడిలో 9 మంది మృతిచెందారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న 11వ శతాబ్ధం నాటి డార్మిషియన్ క్యాథడ్రల్పై కూడా అటాక్ జరిగింది. ఆ దాడి వల్ల చర్చిలో మంటలు చెలరేగాయి.
కీవ్: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడింది రష్యా(Russian Attack). తాజా దాడిలో 9 మంది మృతిచెందారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న 11వ శతాబ్ధం నాటి డార్మిషియన్ క్యాథడ్రల్పై కూడా అటాక్ జరిగింది. ఆ దాడి వల్ల చర్చిలో మంటలు చెలరేగాయి. కీవ్‌లో మొత్తం నలుగురు మృతిచెందారు. ఖార్కీవ్లో మంటల్ని ఆర్పబోయిన అయిదుగురు రెస్క్యూ కార్మికులు కూడా మృతిచెందినట్లు తెలిసింది. దేశ ప్రజలు, వారసత్వంపై రష్యా క్రూరమైన దాడి చేసిందని ఉక్రెయిన్ ప్రధాని యులియా సిరిడెంకో ఆరోపించారు. కీవ్‌లోని పురాతన చర్చిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మరో వైపు రష్యాపై జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడి వల్ల మాస్కో సమీపంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గాయపడ్డారు. రష్యా జరిపిన డ్రోన్, మిస్సైళ్ల దాడి వల్ల బిల్డింగ్లు, కార్లకు నిప్పు అంటుకున్నది. సుమారు 14వేల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సోమవారం మొత్తం ఎయిర్ రెయిడ్ వార్నింగ్ జోన్లోనే ఉక్రెయిన్ ఉన్నది.
ఉక్రెయిన్‌కు చెందిన మూడు ప్రధాన నగరాల్లో ఉన్న మిలిటరీ పరిశ్రమ కేంద్రాలపై రష్యా లాంగ్ రేంజ్ దాడులకు పాల్పడింది. ఆ నగరాల్లో ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌లను కూడా టార్గెట్ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఆకాశం, నేల, సముద్రం నుంచి డ్రోన్లు, మిస్సైళ్లను ఫైర్ చేసినట్లు రష్యా చెప్పింది. అన్ని టార్గెట్లను అనుకున్నట్లే షూట్ చేశామని రష్యా పేర్కొన్నది. మొత్తం 16 ఇండస్ట్రియల్ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా మిలిటరీ తెలిపింది. డ్రోన్ వార్‌హెడ్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టునుక ఊడా పేల్చేశారు. అక్కడ ఫ్లమింగో క్రూయిజ్ క్షిపణులు తయారు అవుతున్నాయి.
కీవ్‌లో ఉన్న ఓ పోస్టల్ టర్మినల్‌ను కూడా అటాక్ చేశారు. మిలిటరీ లాజిస్టిక్స్, డ్రోన్ల సరఫరా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌ను తరలిస్తున్న ప్రాంతాలను టార్గెట్ చేశారు. కీవ్‌లోని సినిమా స్టూడియోను కూడా పేల్చేశారు. అక్కడ కమికేజ్ డ్రోన్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రష్యాకు చెందిన 70 క్షిపణులు, 600కుపైగా డ్రోన్లను డిటెక్ట్ చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. చర్చిపై తాము దాడి చేయలేదని రష్యా చెప్పింది. బహుశా పేట్రియాల్ మిస్సైల్ పేలి ఉంటుందని చెప్పింది.
Efforts to deal with the aftermath of the Russian strikes are ongoing in Kyiv, as well as in Kharkiv. Last night, the Russians launched more than 60 missiles at the capital alone. In total, 70 missiles and 611 drones were used against Ukraine. As of now, 28 people have been… pic.twitter.com/WRp6iEOu7h
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 15, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

