Russia-Ukraine War | ఉక్రెయిన్లో యుద్ధం మిగిల్చిన విషాదం.. ఫొటోలు
ఏడాది క్రితం ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రప్రారంభించింది. వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది దాటింది.
Russia-Ukraine War | ఏడాది క్రితం ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రప్రారంభించింది. వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది దాటింది. రష్యా ఆక్రమణతో మొదలైన ఈ యుద్ధం (War) ఉక్రెయిన్ ప్రతిఘటనతో కొనసాగుతూ వస్తోంది. ఈ యుద్ధంలో ఇరుదేశాలు లక్షలాది మందిని కోల్పోయాయి. వేల సంఖ్యలో ఇండ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. రష్యా (Russia) క్షిపణి దాడులతో విద్యుత్ నిలిచిపోవడంతో ఉక్రెయిన్లోని (Ukraine) చాలా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

చీకట్లోనే తిండీ, నీరు లేక ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీదపడుతుందేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు జీవనం సాగించారు. మధ్యమధ్యలో రష్యా సైన్యం ఇచ్చిన విరామంతో బతుకు జీవువా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కోట్లాదిమంది పొరుగుదేశాలకు వలసబాటపట్టారు. తమేమోగానీ తమ పిల్లలైనా బతికుంటే చాలని పిల్లలను ఒంటరిగా రైళ్లు, బస్సులు ఎక్కించిన ఘటనలు ఎన్నో. అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలిన వారెందరో..

ఎక్కడ చూసినా క్షిపణులతో దెబ్బదిన్న భవనాలు, వాటి శిథిలాలు.. తుపాకీ గుండ్లకుబలై వీధుల్లో పడిన శవాలు.. ఇలా యుద్ధంతో ఇరు దేశాలు ఆర్థికంగా పతనమవడంతోపాటు ప్రపంచ దేశాలను ఆర్థిక మాద్యం అంచున నిలబెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది ముగిసిన సందర్భంగా తుపాకీ గుండ్లు, ఫిరంగి మోతలు, క్షిపణుల దాడులు మిగిల్చిన విషాదానికి సంబంధించిన ఫొటోలు..
















Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

