Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
Russia-Ukraine | అబుదాబీ (Abudabi) లో జరిగిన రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) శాంతి చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఖైదీల విడుదలకు అంగీకరించినప్పటికీ దీనికి సంబంధించిన కచ్చితమైన సంఖ్యను మరికొన్ని గంటల్లో ఖరారు చేస్తామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్నది.
Russia-Ukraine : అబుదాబీ (Abudabi) లో జరిగిన రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) శాంతి చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఖైదీల విడుదలకు అంగీకరించినప్పటికీ దీనికి సంబంధించిన కచ్చితమైన సంఖ్యను మరికొన్ని గంటల్లో ఖరారు చేస్తామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్నది. యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు సానకూలంగా జరిగాయని తెలిపింది.
ఒక్కోవైపు నుంచి సుమారు 1,000 నుంచి 1,500 మంది యుద్ధ ఖైదీలను విడుదలచేసే అంశంపై సమాలోచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధాన్ని విరమింపజేసే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబీ వేదికగా రెండు రోజులపాటు త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లు ఇందులో పాల్గొన్నారు.
రష్యా బృందానికి వ్లాదిమిర్ మెడిన్స్కీ, ఉక్రెయిన్ తరఫున రుస్తెం ఉమెరోవ్ నేతృత్వం వహించారు. గతంలో విఫలమైన శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్నది. రెండురోజుల చర్చలు ముగిసిన నేపథ్యంలో నవంబర్ 12న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవుతామని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

