ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన రష్యన్ కోర్టు
మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం 26వ రోజుకు చేరింది. మరో వైపు దేశంలో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను రష్యన్ కోర్టు నిషేధించింది. ఈ విషయాన్ని రష్యన్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. రష్యాలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లను తీవ్రవాద సంస్థలుగా పేర్కొన్నది. ‘ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న’ కారణంగా రష్యాలో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను తక్షణ నిషేధించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, మెటా కంపెనీకి చెందిన వాట్సాప్‌ను సైతం నిషేధించాలని కోరగా.. ఇందుకు కోర్టు నిరాకరించింది.
చాలా కంపెనీలు దేశం విడిచి వెళ్తున్న తరుణంలో కోర్టు తీర్పు వెలువరించింది. మెటా సంస్థ కార్యకలాపాలు రష్యా, సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఉంటాయని ఎఫ్ఎస్బీ ప్రతినిధి ఇగోర్ కోవెలీస్క్సీ.. ట్వర్స్కోయ్ జిల్లా కోర్టుకు తెలిపారు. మెటా కార్యకలాపాలను నిషేధించమని కోర్టును కోరుతున్నామని.. తీర్పును తక్షణ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన దేశంలోని అతిపెద్ద డెయిరీ కంపెనీ డానోన్, కోకా-కోలా తమ వ్యాపారాలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికన్ షూ కంపెనీ నైక్, స్వీడిష్ హోం ఫర్నిషింగ్ కంపెనీ ఐకియా సైతం రష్యాలో స్టోర్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

