Luna-25: చంద్రుడిపైకి లూనా-25 ఎగిరేది ఎప్పుడో చెప్పిన రష్యా
Luna-25: చంద్రుడిపై దిగే స్పేస్‌క్రాఫ్ట్ లూనా-25 ప్రయోగా తేదీని రష్యా ప్రకటించింది. జూలై 13వ తేదీన దీన్ని ప్రయోగించనున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత రష్యా మూన్ పరీక్షకు సిద్ధమైంది.
మాస్కో: చంద్రుడి మీదకు రష్యా మూన్ ల్యాండర్(Moon Lander) లూనా-25(Luna-25)ను పంపనున్నది. ఆ ప్రయోగ తేదీని ఇవాళ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మస్(Roscosmos) ప్రకటించింది. లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్‌ను జూలై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కాస్మస్ తెలిపింది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఏవియానిక్స్‌లో లోపాలు ఉన్నట్లు రాస్కాస్మస్ చీఫ్ యూరి బొరిసోవ్ తెలిపారు.
1976 తర్వాత చంద్రుడి మీదకు రష్యా లూనార్ ప్రోబ్‌ను పంపిస్తోంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా లూనా-25 ప్రయోగాన్ని సమర్థవంగా చేపట్టనున్నట్లు రాస్కాస్మస్ తెలిపింది. 30 కేజీల సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో లూనా నింగికి ఎగరనున్నది. చంద్రుడిపై అనేక పరీక్షలను ఆ మిషన్ ద్వారా చేపట్టనున్నారు.
చంద్రుడి దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్లవిస్కీ క్రేటర్ వద్ద లూనా-25 ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు 2025లో చంద్రుడిపై అమెరికా తన వ్యోమగాములను దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల చైనా కూడా వరుసగా కొన్ని లూనార్ ప్రయోగాలు చేపట్టింది. ఇక ఇండియా కూడా ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

