మాస్కో: జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను రష్యా పరీక్షించింది. పది జిర్కాన్ మిసైళ్లను పరీక్షించినట్లు రష్యా వార్తా సంస్థ తెలిపింది. యుద్ధ నౌక అడ్మిరల్ గోర్ఖోవ్ నుంచి ఆ క్షిపణులను పరీక్షించారు. అదనంగా మరో రెండు క్షిపణులను సబ్మెరైన్ నుంచి పరీక్షించినట్లు తెలుస్తోంది. కొత్త తరానికి ఇవి ఎదురులేని ఆయుధాలు అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కామెంట్ చేశారు.