మాస్కో: జలాంతర్గామి ద్వారా హైపర్సోనిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సివరోడ్విన్స్కీ సబ్‌మెరైన్ ద్వారా.. బ్యారెంట్ సముద్రంలో.. జిర్కాన్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. తొలిసారి న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించినట్లు చెప్పారు. నిర్దేశిత టార్గెట్‌ను ఆ క్షిపణి ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. తొలిసారి ఓ సబ్‌మెరైన్ నుంచి జిర్కాన్ క్షిపణిని పరీక్షించారు. గతంలో యుద్ధ నౌక నుంచి ఆ మిస్సైల్‌ను పరీక్షించారు. ధ్వని వేగం కన్నా 9 రేట్లు ఎక్కువ వేగంతో జిర్కాన్ క్షిపణి ప్రయాణిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను అది ధ్వంసం చేస్తున్నది. ఈ పరీక్షతో రష్యా తన సైనిక సామర్థ్యం మరింత బలోపేతం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాదిలోగా జిర్కాన్ పరీక్షలు పూర్తి చేసి, వచ్చే ఏడాది వాటిని రష్యన్ నేవీలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన క్రూయిజర్లు, ఫ్రిగేట్లు, సబ్మెరైన్లలో జిర్కాన్ క్షిపణులు ఉండనున్నాయి.