భారత విద్యార్థులకు రష్యా స్కాలర్షిప్స్
మనదేశ విద్యార్థులకు రష్యా శుభవార్త చెప్పింది. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందిస్తామని చెన్నైలోని రష్యా హౌస్ బుధవారం వెల్లడించింది.
చెన్నై, నవంబర్ 15: మనదేశ విద్యార్థులకు రష్యా శుభవార్త చెప్పింది. తమ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందిస్తామని చెన్నైలోని రష్యా హౌస్ బుధవారం వెల్లడించింది. రష్యాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులు ఆయా యూనివర్సిటీలు అందించే స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. దేశంలోని 89 ప్రాంతాల్లో 766 రష్యన్ విశ్వవిద్యాలయాలకు ఈ దరఖాస్తులను పంపవచ్చు. విద్యార్థులకు 200 గ్రాంట్ల వరకు స్కాలర్షిప్ అందిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, రిసెర్చి ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్, జనరల్ మెడిసిన్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఫిజిక్స్ కోర్సులకు ఈ స్కాలర్షిప్లు ఇస్తామని రష్యా హౌస్ తెలిపింది. దీని కోసం www.education-in-russia.com వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

