ఉక్రెయిన్లో జీవాయుధాలు… అమెరికా వివరణ ఇవ్వాలని రష్యా డిమాండ్
మాస్కో: ఉక్రెయిన్లో జీవాయుధాల ఆనవాళ్లను గుర్తించినట్లు రష్యా ఆరోపించింది. వీటి తయారీపై అమెరికా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా, బుధవారం వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన మూడో రౌండ్ చర్చల్లో కొంత పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదన్నారు.
కాగా, ఉక్రెయిన్లో జీవాయుధాలను అమెరికా అభివృద్ధి చేస్తున్నదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. దీనిపై తమ వద్ద డాక్యుమెంటల్ ఆధారాలున్నాయని చెప్పారు. ఉక్రెయిన్లో జీవ పరిశోధనల కోసం తమ ల్యాబ్లు ఉన్నాయన్న అమెరికా రాజకీయ వ్యవహారాలకు చెందిన విక్టోరియా నులాండ్ ప్రకటనను ఆమె ప్రస్తావించారు. ‘ఈ పరిశోధనలు దేని కోసం?, మీరు (అమెరికా) ఉక్రెయిన్లో ఎందుకు ఉన్నారు? ఈ కార్యక్రమానికి అమెరికా రక్షణ శాఖ ఎందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నది?’ అని ఆమె ప్రశ్నించారు. జీవ పరిశోధనలకు సంబంధించిన వివరాలను రష్యా డిమాండ్ చేస్తున్నదని అన్నారు. అమెరికా సమాధానం కోసం ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నదని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ సందర్భంగా జీవాయుధ కార్యకలాపాలను గుర్తించినట్లు రష్యా ఆరోపించింది. అమెరికా రక్షణ శాఖ నిధులతో చేస్తున్న ఈ పరిశోధనల సమాచారాన్ని ఉక్రెయిన్ దాచిపెట్టిందని విమర్శించింది. అయితే జీవాయుధాల గురించి రష్యా చేసిన ఆరోపణలను ఉక్రెయిన్తోపాటు అమెరికాకు చెందిన పెంటాగాన్ ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

