రష్యాలో కొత్తగా 40,096 కరోనా కేసులు.. 1,159 మరణాలు

మాస్కో: రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా రికార్డుస్థాయిలో 40,096 కరోనా కేసులు, 1,159 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు అత్యవసరం కాని సేవలను 11 రోజుల పాటు నిలిపివేశారు. పాఠశాలలు, కిండర్ గార్టెన్లతో సహా రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లు, క్రీడా, వినోదానికి సంబంధించిన వాటిని మూసివేశారు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. కరోనా తీవ్రతను నియంత్రించేందుకు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు వారం రోజులు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించారు.
మరోవైపు కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిలో ముందున్న రష్యా, ఆ దేశ ప్రజలకు టీకాలు అందించలేకపోతున్నది. ఇప్పటి వరకు 32 శాతం జనాభా మాత్రమే వ్యాక్సిన్ పొందారు. టీకా తీసుకునేందుకు రష్యా ప్రజలు చొరవ చూపడం లేదు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వీడి వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ముందుకు రావాలని అధ్యక్షుడు పుతిన్ ఇటీవల విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

