ప్రపంచంలో తొలిసారి.. జంతువులకు కోవిడ్ టీకా ఇవ్వనున్న రష్యా

మాస్కో: జంతువులకు ఇచ్చే కోవిడ్ టీకాను రష్యా తయారు చేస్తున్నది. ఆ టీకాలతో ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. జంతువుల కోసం కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి రష్యా రిజిస్టర్ చేసుకున్నది. రష్యాకు చెందిన వ్యవసాయ సంబంధిత శాఖ రూజుల్‌కోజ్‌నడార్ ఈ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. జంతువులకు ఇచ్చే కోవిడ్ టీకాకు కార్నివాక్-కోవ్ అని పేరు పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ టీకా ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. కుక్కులు, పిల్లులు, నక్కలు, మింక్ జంతువులకు ఈ టీకాలు ఇవ్వవచ్చు అని రష్యా పేర్కొన్నది. ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఇమ్యూనిటీ అధిక స్థాయిలో ఉన్నట్లు గ్రహించామని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న జంతువులు నూటికి నూరు శాతం కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను డెవలప్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి భారీ మొత్తంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని రూజుల్‌కోజ్‌నడార్ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

