కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
Ceasefire | ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించిన రష్యా గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌పై క్షిపణులతో దాడిచేసింది.
కీవ్: ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించిన రష్యా గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌పై క్షిపణులతో దాడిచేసింది. దీంతో 14కుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్ హోంచరెంకో చెప్పారు. ఖైర్సన్లో జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారని అధికారులు వెల్లడించారు.
సుమారు 11 నెలలుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి పుతిన్ తాత్కాలికి విరామం ప్రకటించారు. ఆర్ధడాక్స్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్ధరాత్రి 12 వరకు 36 గంటల పాటు ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడులు చేయొద్దని సైన్యాన్ని ఆదేశించారు. అయితే ఇది అమల్లోకి వచ్చిన గంటల్లోనే రష్యా దాడులకు దిగడం విశేషం.
కాగా, కాల్పుల విరమణపై రష్యాను నమ్మడానికి వీల్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. అదనపు బలగాలను మోహరించేందుకుఏ విరామం తీసుకుంటున్నారని, దానికి కాల్పుల విరమణ అని పేరుపెట్టారని విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

