గుడ్‌న్యూస్.. స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. రష్యా అనుమతి

మాస్కో: రష్యాకు చెందిన స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌కు గురువారం రష్యాకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థే ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ లైట్. దీని సామర్థ్యం 80 శాతంగా ఉండటం విశేషం. ఇదే విషయాన్ని చెబుతూ.. స్పుత్నిక్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది. దీని పేరు స్పుత్నిక్ లైట్. ఇది విప్లవాత్మకమైన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్. 80 శాతం సామర్థ్యం ఉన్నట్లు తేలింది. ఇది ఎన్నో డబుల్ డోస్ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ వల్ల వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుంది అని తయారీ సంస్థ ట్వీట్ చేసింది.
ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సాయం చేసింది. ఈ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. స్పుత్నిక్ లైట్ సామర్థ్యం 79.4 శాతంగా తేలింది. అదే రెండు డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామర్థ్యం మాత్రం 91.4 శాతంగా ఉంది. గతేడాది డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకూ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 28 రోజుల డేటాను సేకరించి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఇప్పటి వరకూ స్పుత్నిక్ వి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 80 లక్షల మంది రష్యన్లు తీసుకున్నారు.
Introducing a new member of the Sputnik family – a single dose Sputnik Light!
— Sputnik V (@sputnikvaccine) May 6, 2021
It’s a revolutionary 1-shot COVID-19 vaccine with the 80% efficacy – higher than many 2-shot vaccines.
Sputnik Light will double vaccination rates and help to handle epidemic peaks ✌️ pic.twitter.com/BCybe8yYWU
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

