Russia | సొంత నగరంపైనే రష్యా యుద్ధ విమానం దాడి.. ధ్వంసమైన భవనాలు
ఉక్రెయిన్ (Ukraine) సరిహద్దుల్లోని సొంత నగరంపైనే రష్యా (Russia) యుద్ధవిమానం (Warplane) దాడికి పాల్పడింది. దీంతో భారీ పేలుడు సంభవించడంతోపాటు పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బెల్గొరోడ్ (Belgorod) నగరంపై రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్‌యూ-34 (Sukhoi Su-34) యుద్ధ విమానం ప్రమాదవశాత్తు బాంబును పేల్చింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) సరిహద్దుల్లోని సొంత నగరంపైనే రష్యా (Russia) యుద్ధవిమానం (Warplane) దాడికి పాల్పడింది. దీంతో భారీ పేలుడు సంభవించడంతోపాటు పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బెల్గొరోడ్ (Belgorod) నగరంపై రష్యాకు చెందిన సుఖోయ్ ఎస్‌యూ-34 (Sukhoi Su-34) యుద్ధ విమానం ప్రమాదవశాత్తు బాంబును పేల్చింది. దీంతో నగరంలో పలు భవనాలు దెబ్బతిన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేలుడు కారణంగా నగరంలోని ప్రధాన వీధుల్లో ఒకదానిపై 20 మీటర్ల పొడవున్న గొయ్యి (Crater) ఏర్పడిందని బెల్గోరోడ్ ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ (Vyacheslav Gladkov) తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలో అత్యవసర పరిస్థితి విధించామన్నారు.
ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సుఖోయ్ ఎస్‌యూ-34 యుద్ధ విమానం బెల్గొరోడ్ మీదుగా వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు బాంబులను పేల్చిందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అది ఉక్రెయిన్ సరిహద్దుకు కొద్ది దూరంలో ఉందని వెల్లడించింది. ఈ పేలుడుతో ఇద్దరు మహిళలు గాయపడ్డారని పేర్కొన్నది. అయితే ఈ ఘటనకు కారణమైన ఆయుధం ఏదనే విషయమై మంత్రిత్వ శాఖ స్పష్టతనివ్వలేదు. దాడి నేపథ్యంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో కార్లు ధ్వంసమయ్యాయి.



Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

