Slovakia PM Robert Fico | కాల్పుల్లో గాయపడ్డ స్లావేకియా ప్రధాని పరిస్థితి విషమం..?!
Slovakia PM Robert Fico | దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయ పడ్డ స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మీడియా వార్తా కథనాలు చెబుతున్నాయి.
Slovakia PM Robert Fico | దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయ పడ్డ స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మీడియా వార్తా కథనాలు చెబుతున్నాయి. శరీరంపై పలు గాయాలు కావడంతో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని రాబర్ట్ ఫికో ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొన్ని గంటలు గడిచే వరకూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంటుందని స్లావేకియా విదేశాంగశాఖ మంత్రి జురాజ్ బ్లానర్ పేర్కొన్నారు.
స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికోకు పొత్తి కడుపులో గాయాలైనట్లు తెలుస్తున్నది. ఒక బుల్లెట్ పొత్తి కడుపులోకి, ఒక బుల్లెట్ తలకు తగిలిందని ఈస్ట్రన్ యూరోపియన్ మీడియా ‘నెక్స్టా’ తెలిపింది. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు మరో మూడు వారాల్లో జరుగనుండగా రాబర్ట్ ఫికోపై దాడి జరగడం ఆసక్తికరంగా మారింది.
స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి చేసిన వ్యక్తి జురాజ్ కింటులా (71) అని, ఆయన ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేశారని స్థానిక మీడియా తెలిపింది. అతడు కవి, రచయిత అని కూడా తెలిపింది. కాగా, స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడిని హంగేరీ ప్ఱధాని విక్టోర్ ఒర్బాన్, జెక్ ప్రధాని పీటర్ ఫైలా, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

