mRNA Vaccine: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ ప్రాజెక్టులకు బ్రేక్.. 500 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఆపేసిన అమెరికా
mRNA Vaccine: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్న కంపెనీలకు జలక్ ఇచ్చింది అమెరికా సర్కారు. ఆ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఎంఆర్ఎన్ఏ ప్రాజెక్టుల కోసం కేటాయించిన 500 మిలియన్ల డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్లు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది.
న్యూయార్క్: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు(mRNA Vaccine) అభివృద్ధి చేస్తున్న కంపెనీలకు జలక్ ఇచ్చింది అమెరికా సర్కారు. ఆ దేశానికి చెందిన ఆరోగ్య శాఖ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఎంఆర్ఎన్ఏ ప్రాజెక్టుల కోసం కేటాయించిన 500 మిలియన్ల డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్లు హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ పేర్కొన్నది. ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ దీనిపై ప్రకటర చేశారు.
కోవిడ్‌తో పాటు వివిధ రకాల వైరస్ల నియంత్రణ కోసం కొన్ని కంపెనీలు ఎంఆర్ఎన్ఏ టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. దానిలో భాగంగా ఫైజర్, మోడెర్నా లాంటి ఫార్మసీ సంస్థలతో గతంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై సుమారు 22 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు ప్రస్తుతం నిధుల్ని నిలిపివేస్తున్నట్లు ఆర్ఎఫ్కే జూనియర్ తెలిపారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల వల్ల శ్వాసకోస వైరస్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. కోవిడ్ సమయంలో జరిగిన ఎంఆర్ఎన్ఏ సంబంధిత పెట్టుబడులపై సమగ్రమైన సమీక్ష చేపట్టిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. రద్దు చేసిన నిధులను మరింత సురక్షితమైన వ్యాక్సిన్ ఫ్లాట్‌ఫామ్‌లకు తరలించనున్నట్లు కెన్నడీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

