న్యూఢిల్లీ: కబడ్డీ మ్యాచ్ రణరంగంగా మారింది. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా మారి తన్నుకున్నారు(Gangs Clash). కత్తులతో అటాక్ చేసుకున్నారు. తుపాకీ శబ్ధాలు కూడా వినిపించాయి. బ్రిటన్‌లోని డెర్బీషైర్‌లో జరిగిన మ్యాచ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడికి చెందిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. హాకీ స్టిక్‌లతోనూ రెండు గ్యాంగ్‌లు అటాక్ చేసుకున్నాయి. గన్ షాట్స్ వినబడడంతో.. కబడ్డీ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన జనం పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. సుమారు 20 పోలీసు కార్లు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి.
Jabardast fight erupted between Spectators in Kabaddi tournament at Derby, England.
This happens when people get free Liquor and Kabaab.
Then all the Punjabi's become Nawab pic.twitter.com/9Ffu9PuIwx— RANA SANGHA – RoughSeaSailor. (@Sangha2Bs) August 21, 2023