మంత్రి రిషి సునాక్ స్థానంలో నదీమ్ జాహవి
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. ఆయన ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. బోరిస్ నేతృత్వంలోని సర్కార్ సరైన రీతిలో నడవడం లేదని ఆ ఇద్దరూ ఆరోపించారు. ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని, కానీ ప్రభుత్వాన్ని ఇలా కంటిన్యూ చేయలేమని రిషి సునాక్ తెలిపారు. ప్రభుత్వం సరైన విధానంలో నడవాలని, పోటీతత్వంతో ఉండాలని ప్రజలు భావిస్తారని, కానీ జరగడం లేదన్నారు. బహుశా ఇదే తన చివరి మంత్రి పదవి అంటూ తన లేఖలో తెలిపారు.
ప్రధాని బోరిస్ జాన్సన్ సామర్థ్యంపై తనకు నమ్మకం పోయినట్లు జావెద్ తెలిపారు. బోరిస్ నాయకత్వంలో పరిస్థితులు మారవని స్పష్టం అవుతోందని, అందుకే నమ్మకం సడలినట్లు జావెద్ తన రాజీనామా లేఖలో తెలిపారు. ఇద్దరు కీలక మంత్రుల రాజీనామా నేపథ్యంలో ప్రధాని బోరిస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం మారింది. కరోనా వేళ నియమావళి ఉల్లంఘించి పార్టీలు నిర్వహించిన బోరిస్ పార్టీగేట్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. కానీ బోరిస్ మాత్రం తలొగ్గడంలేదు. మంత్రులు రాజీనామా చేసినా.. కొత్త క్యాబినెట్‌ను విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు.
రిషి సునాక్ స్థానంలో నదీమ్ జాహవి మంత్రిగా నియమితుడయ్యారు. బగ్దాద్‌లో పుట్టిన ఈయనది కుర్దీష్ కుటుంబం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

