Viral video: బ్రిటన్‌లో గోపూజ..పీఎం అభ్యర్థి రిషి సునక్ వీడియో వైరల్!
బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఫైనలిస్ట్ అయిన రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయన భార్య అక్షతామూర్తితో కలిసి సునక్ గోమాతను పూజిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సునక్ తన భార్య పక్కన నిల్చుండి గోపూజలో పాల్గొన్నారు.
లండన్: బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఫైనలిస్ట్ అయిన రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయన భార్య అక్షతామూర్తితో కలిసి సునక్ గోమాతను పూజిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సునక్ తన భార్య పక్కన నిల్చుండి గోపూజలో పాల్గొన్నారు.
రిషి సునక్ మొదట భారతీయ సంప్రదాయం ప్రకారం ఇత్తడి చెంబుతో ఆవుకు నీళ్లు తాగించారు. అనంతరం అర్చకుడి వేదమంత్రోచ్ఛరణల నడుమ గోవుకు హారతి ఇచ్చారు. గోమాత ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఇటీవల రిషి సునక్ లండన్ శివార్లలోని భక్తివేదాంత మనోర్ను సందర్శించారు. భగవద్గీత తనకు ఎంతో మనోబలాన్ని ఇస్తుందని చెప్పారు.
Who? Rishi Sunak (PM candidate)
Where ? London, England
What ? Performing Cow worshipThat’s our rich cultural heritage we must be proud about.
तत् त्वम असि = Tat twam asi #Hinduism #Rishisunak #India #London #Hindutva pic.twitter.com/aaKdz9UM5R
— Sumit Arora (@LawgicallyLegal) August 25, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

