Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. తొలి భారత సంతతి నేత
Rishi Sunak | పెన్నీ మోర్డాంట్ అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ నియామకం ఖాయమైంది.
Rishi Sunak | భారత సంతతికి చెందిన రిషి సునాక్.. అగ్రరాజ్యం బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. మినీ బడ్జెట్‌తోపాటు సంపన్నులపై పన్ను కోతలు విధించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.
లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాను మళ్లీ బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రకటించారు. ఆయనకు దాదాపు 193 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా రిషి సునాక్ (42) నిలుస్తారు. అంతే కాదు తొలిసారి భారత సంతతి నాయకుడు బ్రిటన్‌కు సారధ్యం వహిస్తున్న రికార్డు నెలకొల్పుతారు.
Congratulations @RishiSunak on being appointed as Leader of the Conservative Party and our next Prime Minister.
You have my full support.
— Liz Truss (@trussliz) October 24, 2022
ఆయనకు ప్రత్యర్థిగా పెన్నీ మోర్డాంట్ పోటీ చేస్తానని ప్రకటించినా ఆచరణలో ఆమె 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టలేకపోయారు. దీంతో ఆమె ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు తెలిపారు.
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ.. డౌనింగ్ స్ట్రీట్-10లో అడుగు పెట్టాలని భావించినా అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల నుంచి మద్దతు సంపాదించలేకపోయారు. ఆయనకు కేవలం 58 మంది ఎంపీలు మాత్రమే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఐక్యత కోసం తాను ప్రధాని పదవి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్ ఎన్నిక దాదాపు ఖాయమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

