క్విటో: సాంకేతిక సమస్య వల్ల ఎత్తులో ఉన్న కేబుల్ కార్లు (cable car rides) ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సుమారు 70 మంది సందర్శకులు వాటిల్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన రెస్క్యూ సిబ్బంది ఎంతో శ్రమించారు. కేబుల్ కార్ రైడ్లలో చిక్కుకున్న వారిని కాపాడారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్వెడార్ రాజధాని క్విటోలో ఈ సంఘటన జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గొండోలాస్ కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. గురువారం సాయంత్రం 4 గంటలకు వాటిల్లిన ఈ సమస్య వల్ల కేబుల్ కార్ రైడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. చాలా ఎత్తులో ఉన్న కేబుల్ కార్లతోపాటు కొండపై సుమారు 70 మంది చిక్కుకున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చాలా ఎత్తులో ఉన్న కేబుల్ కార్ల వద్దకు చేరుకున్నారు. వాటిలో ఉన్న వారిని తాడు సహాయంతో సురక్షితంగా కిందకు చేర్చారు. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
మరోవైపు కేబుల్ కార్లలో 27 మంది, ఎలాంటి రవాణా సౌకర్యం లేని ఎతైన కొండ ప్రాంతంలో 47 మంది చిక్కుకున్నట్లు క్విటో మున్సిపల్ అధికారులు తెలిపారు. వారందరినీ సురక్షిత ప్రాంతానికి చేర్చడంతోపాటు వైద్య సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు పూర్తయ్యేంత వరకు కేబుల్ కార్లను నిలిపివేయాలని క్విటో మేయర్ ఆదేశించారు. కాగా, రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Teleférico de #Quito clausurado.
27 personas quedaron atrapadas en las góndolas por varias horas.
El rescate culmino a pasada las 3:00 am del viernes. pic.twitter.com/gd0nxUfDEB— Almorsadero DT (@almorsadero_dt) July 7, 2023
Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw
— LaHistoria (@lahistoriaec) July 7, 2023
Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS
— LaHistoria (@lahistoriaec) July 7, 2023