టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాలెంటినా గోమేజ్(Valentina Gomez) అనే మహిళ.. ఇస్లాం మత గ్రంధం ఖురాన్‌కు నిప్పుపెట్టింది. తమ రాష్ట్రంలో ఇస్లాం లేకుండా చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. తన వార్నింగ్‌కు చెందిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టెక్సాస్‌లో ఇస్లాంను అంతం చేయడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. తమ రాష్ట్రాన్ని ముస్లింలు విడిచి వెళ్లాలని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచార శైలిలో ఆమె వీడియోను రిలీజ్ చేసింది. క్రైస్తవ దేశాలను ముస్లింలు హింసతో బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పింది. తన లక్ష్యం నెరవేరేలా ప్రజలు సహకరించాలని ఆమె అన్నారు. క్రైస్తవ దేశాలను ఓవర్టేక్ చేసేందుకు ముస్లింలు రేప్‌లు, హత్యలకు పాల్పడుతున్నట్లు తన ఎక్స్ అకౌంట్లో ఆమె ఆరోపించింది. ఆ మెసేజ్ ప్రస్తుతం ఆమె డిలీట్ చేసింది.
ఇస్లాంను అడ్డుకోలేకుంటే మీ కూతుళ్లను రేప్ చేస్తారని, మీ కొడుకుల తల నరికేస్తారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఖురాన్‌కు నిప్పుపెట్టేందుకు వెళ్తున్నట్లు వీడియోలో ఉన్నది. ఖురాన్‌ను కాల్చినందుకు తానేమీ బాధపడడం లేదని గోమేజ్ అన్నారు. ఇజ్రాయిల్‌లో అక్టోబర్ 7వ తేదీ జరిగిన దాడులకు ఖురానే కారణమని ఆమె అన్నారు.
Not a single muslim has condemned the rape of little girls in Europe by their fellow rapist muslims.
Because that’s what the Quran teaches, to rape & to “instill terror into the hearts of the disbelievers”
Jesus rose from the dead, can’t say the same about Muhamed. pic.twitter.com/Br0MstNzP7
— Valentina Gomez (@ValentinaForUSA) August 27, 2025