విల్నియస్, డిసెంబర్ 26: విషపూరితమైన శక్తి వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇందులో బయోడీజిల్ ఒకటి. జీవమూలకాల నుంచి తయారుచేసిన బయోడీజిల్ పర్యావరణ అనుకూల శక్తి వనరుగా మారుతున్నా చాలా ఖరీదైనది. దీంతో దీన్ని వాడకానికి ఇప్పటివరకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే, సిగరెట్ పీకలతో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు లిథువేనియా పరిశోధకులు.