Vladimir Putin | బెలారస్ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఎందుకో తెలుసా..?
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు కృతజ్ఞతలు తెలియజేశారు. రష్యాపై తిరుగుబాటు చేసిన ప్రైవేటు సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ అయిన యెవ్గెనీ ప్రిగోజిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు కృతజ్ఞతలు తెలియజేశారు. రష్యాపై తిరుగుబాటు చేసిన ప్రైవేటు సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ అయిన యెవ్గెనీ ప్రిగోజిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోనే ప్రిగోజిన్‌తో చర్చించి వార్నర్ గ్రూపు తిరుగుబాటును అడ్డుకున్నారు.
ప్రిగోజిన్ సేనలు రష్యా సైన్యంపై తిరుగుబాటు చేయకుండా.. రష్యా ప్రభుత్వం ప్రిగోజిన్‌ను గానీ, అతని సైన్యంలోని అధికారులనుగానీ శిక్షించకుండా బెలారస్ అధ్యక్షుడు మంతనాలు జరిపారు. దాంతో ఎలాంటి రక్తపాతం జరగకుండానే రష్యా సైన్యంపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఆగిపోయింది. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లిపోయాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

