Naftali Bennett | జెలెన్స్కీని చంపనని పుతిన్ నాకు మాటిచ్చారు : ఇజ్రాయెల్ మాజీ ప్రధాని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు మాటిచ్చారని.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వెల్లడించారు. ఈ విషయాన్ని జెలెన్స్కీకి కూడా ఫోన్ ద్వారా తెలియజేసినట్లు బెన్నెట్ చెప్పారు.
Naftali Bennett | రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే, యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదొమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy)ని చంపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే, జెలెన్స్కీని చంపబోనని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తనకు మాటిచ్చారని.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ (Naftali Bennett) తాజాగా వెల్లడించారు.
ఇరుదేశాల మధ్య నెలకొన్న యుద్ధాన్ని ఆపేందుకు కొందరు నేతలు మధ్యవర్తిత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ కూడా ఒకరు. గతంలో ఆయన స్వయంగా మాస్కోకు వెళ్లి పుతిన్‌ను కలిసి యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమావేశానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బెన్నెట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘గతేడాది మార్చిలో మాస్కో పర్యటనకు వెళ్లా. అక్కడ పుతిన్‌తో సమావేశం సందర్భంగా జెలెన్స్కీ విషయాన్ని ప్రస్తావించా. ‘మీరు జెలెన్స్కీని చంపాలనుకుంటున్నారా..?’ అని అడిగా. అందుకు పుతిన్ స్పందిస్తూ.. ‘లేదు’ అని సమాధానమిచ్చారు. ‘జెలెన్స్కీని చంపనని మీరు నాకు మాటిస్తున్నారా?’ అని మరోసారి అడిగా. ‘జెలెన్స్కీని నేను చంపను’ అని పుతిన్ మళ్లీ స్పష్టంగా చెప్పారు’ అని బెన్నెట్ వివరించారు.
ఈ విషయాన్ని జెలెన్స్కీకి కూడా ఫోన్ ద్వారా తెలియజేసినట్లు బెన్నెట్ చెప్పారు. ‘నేను చెప్పేది విను.. మీటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను. పుతిన్ నాకు మాటిచ్చాడు. అతను నిన్ను చంపడు’ అని తెలియజేశానని తెలిపారు. దీంతో ‘నిజంగానా?’ అని జెలెన్స్కీ అడిగారని, తాను 100 శాతం నిజమని చెప్పానని వివరించారు.
అయితే, బెన్నెట్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిద్రో కుబేలా స్పందించారు. పుతిన్‌ను నమ్మలేమని అన్నారు. ‘మోసపోకండి.. అతను మహా అబద్ధాలకోరు. అతన్ని నమ్మలేం. అతను ఏదైనా చేయనని మాటిచ్చాడంటే.. అది కచ్చితంగా అతని ప్లాన్‌లో భాగమే అయి ఉంటుంది’ అని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

