Rishi Sunak | పంజాబ్ టు బ్రిటన్.. ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్!
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. ఈ నెల 28న ప్రధానిగా ఆయన ప్రమాణం చేస్తారు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ ఆ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఈ నెల 28న బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి.. కొన్ని వందల ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించింది బ్రిటన్. కానీ, ఈనాడు అదే వలస పాలన దేశమైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రిషి సునాక్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్ జన్మించారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి.. అంతకుముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 2001-04 మధ్య గోల్డ్‌మాన్ సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు. రెండు హెడ్జ్ కంపెనీల్లో పని చేశారాయన.

ఇన్ఫీ మూర్తి అల్లుడే రిషి సునాక్
ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్ పెండ్లి చేసుకున్నారు. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రిషి సునాక్ తొలిసారి 2014లో రిచ్మండ్ నుంచి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి సునాక్ పేరు నమోదైంది.
తొలుత సహాయ మంత్రిగా.. అటుపై చాన్స్‌లర్
తొలుత బ్రిటన్ సహాయ మంత్రిగానూ, తర్వాత క్యాబినెట్ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పని చేశారు. బ్రిటన్ చాన్స్‌లర్‌గా పని చేసిన తొలి భారతీయుడిగానూ రిషి సునాక్ చరిత్ర నెలకొల్పారు. ఆయనకు ఫుట్‌బాల్, క్రికెట్, ఫిట్నెస్, సినిమాలు అంటే ఎంతో ఇష్టం. బోరిస్ జాన్సన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్.. నాయకుడి వ్యవహారశైలిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి వేళ జాన్సన్ అనుసరించిన వైఖరి వివాదాస్పదమైంది. స్కామ్‌లలోనూ బోరిస్ జాన్సన్ చిక్కుకున్నట్లు తేలడంతో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా చేశారు. తర్వాత జాన్సన్ క్యాబినెట్లో అత్యధికులు వైదొలిగారు. దీంతో బోరిస్ జాన్సన్ ప్రధానిగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
జాన్సన్ రాజీనామాతో వెలుగులోకి సునాక్
బోరిస్ జాన్సన్ రాజీనామా చేయగానే ప్రధాని పదవి రేసులో తానూ ఉన్నట్లు ముందే ప్రకటించారు రిషి సునాక్. కానీ తన వెన్నంటి ఉంటూ తనకు వెన్నుపోటు పొడిచాడన్న అనుమానంతో రిషి సునాక్‌ను బోరిస్ జాన్సన్ వ్యతిరేకించారు. లిజ్ ట్రస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. తొలి దశలో రిషి సునాక్‌కు ఎంపీలు మద్దతు తెలిపినా.. తర్వాతీ దశల్లో తగ్గుముఖం పట్టింది. మెజారిటీ అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చినా.. పార్టీ సభ్యులు లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపారు. సంపన్నులపై పన్నుల్లో కోత విధిస్తానని లిజ్ ట్రస్ చేసిన వాగ్ధానం అందరినీ ఆకర్షించింది.
లిజ్ ట్రస్ చర్యలతో ఆర్థిక సంక్షోభం
కానీ, ఇతర దేశాల మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. కరోనా తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పరిస్థితులు విషమించాయి. ద్రవ్యోల్బణం ఘాటు నషాళానికి అంటుతున్నది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గిస్తానని లిజ్ ట్రస్ చేసిన ప్రకటన తుస్‌మంది. మినీ బడ్జెట్ ప్రతిపాదించడంలోనే అవకతవకలు ఉండటంతో ఆర్థిక మంత్రిని తప్పించారు లిజ్ ట్రస్. తర్వాత బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ చాన్స్‌లర్‌ను ఆర్థిక మంత్రిగా నియమించినా.. చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటామని లిజ్ ట్రస్ విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్ వైదొలిగారు. లిజ్ ట్రస్ వారసుడిగా రిషి సునాక్ పోటీ పడ్డారు. తొలుత బోరిస్ జాన్సన్ బరిలో ఉంటానన్నా.. 58 మంది ఎంపీలే బాసటగా నిలవడంతో పార్టీ ఐక్యత కోసం తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పెన్నీ మోర్డాంట్ చివరి వరకు పోటీలో ఉన్నా.. మద్దతు కూడగట్టలేక వైదొలిగారు.
Congratulations @RishiSunak on being appointed as Leader of the Conservative Party and our next Prime Minister.
You have my full support.
— Liz Truss (@trussliz) October 24, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!




