భారతీయ-అమెరికన్ నీల్బేడీకి పులిట్జర్

న్యూయార్క్, జూన్ 12: అమెరికాలో ఓ పోలీసు దుశ్చర్యను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ-అమెరికన్ నీల్బేడీ లోకల్ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ అవార్డు గెలుచుకొన్నారు. ఆయన టంపాబే టైమ్స్ అనే వార్తాసంస్థలో పనిచేస్తున్నారు. అమెరికాలోని పాస్కో అనే ప్రాంతంలో ఉన్న స్థానిక పోలీసు అధికారి.. ఒక కంప్యూటర్ మోడల్ సాయంతో ‘భవిష్యత్తులో నేరాలు చేసే అవకాశం ఉన్న వారిని’ గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునేవారు. అనుమానిత వ్యక్తుల జాబితాలో చిన్నపిల్లలు కూడా ఉండేవాళ్లు. ఈ అన్యాయాన్ని నీల్బేడీ తన సహచర జర్నలిస్టు కేథలీన్ మెక్ గ్రోరీ సాయంతో వరుస కథనాలు వెలువరించి ప్రపంచానికి తెలియజేశారు. నీల్‌తోపాటు కేథలీన్ కూడా పులిట్జర్‌కు ఎంపికయ్యారు.
21 రంగాల్లో ఎంపిక
పులిట్జర్ ప్రైజ్‌ను మీడియాతోపాటు మొత్తం 21 రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఏటా ఇస్తారు. 20 రంగాల విజేతలకు దీనికింద 15 వేల డాలర్లు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ప్రజాసేవ విభాగంలో పురస్కారం లభించిన వ్యక్తికి మాత్రం బంగారుపతకం ఇస్తారు.
‘ఫ్లాయిడ్ హత్య’ను రికార్డు చేసిన టీనేజర్‌కు ప్రశంస
అమెరికావ్యాప్తంగా జాతివివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని మరోమారు పురిగొల్పిన జార్జ్‌ఫ్లాయిడ్ హత్య ఉదంతాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డు చేసిన టీనేజర్ డార్నెల్లా ఫ్రేజియర్‌ను పులిట్జర్ బోర్డు ప్రత్యేకంగా ప్రశంసించింది. గత ఏడాది మే 25న నల్లజాతీయుడు జార్జ్ఫ్లాయిడ్ను మినియాపొలిస్‌లో ఓ శ్వేతజాత్యంహకార పోలీసు అధికారి బహిరంగంగా, మెడ మీద తన మోకాలు మోపి హత్య చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రేజియర్ ఈ దారుణాన్ని సెల్ కెమెరాతో రికార్డు చేసింది. కేసు విచారణలో ఆ వీడియో కీలక ఆధారంగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- floid
- niel bedi
- Pulitzer Prize
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

