Pakistan | పాక్ స్టేడియం సమీపంలో బాంబు పేలుడు.. గ్రౌండ్లోకి రాళ్లు రువ్విన ఫ్యాన్స్.. పలువురు పోలీసులకు గాయాలు
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక అయిన క్వెట్టాలోని బిగుత్ స్టేడియం సమీపంలో బాంబు పేలింది. దాంతో, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. తర్వాత 4 వేలమంది పోలీసు బందోబస్తు మధ్య మ్యాచ్ కొనసాగింది.
Pakistan : పాకిస్థాన్ రెండు మూడు రోజులుగా బాంబు పేలుళ్లతో అట్టుడుకుతోంది. మసీదులో బాంబు పేలుడు ఘటన మరువక ముందే మరో బాంబు దాడి జరిగింది. ఈరోజు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ వేదిక అయిన క్వెట్టాలోని బిగుత్ స్టేడియం సమీపంలో బాంబు పేలింది. పోలీస్ స్టేషన్ దగ్గర్లోని మూసా చౌకా ప్రాంతంలో బాంబు పేలడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అదే సమయంలో బిగుత్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
4 వేలమందితో బందోబస్తు
కోపోద్రిక్తులైన మరికొందరు అభిమానులు బిగుత్ స్టేడియంలోకి రాళ్లు రువ్వారు. మరికొందరు టైర్లకు నిప్పు పెట్టడంతో మైదానంలో పొగ ఆవరించింది. దాంతో, ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. స్టేడియం బయట భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు అందోళనకారులను చెదరగొట్టారు. 4 వేలమంది పోలీసు బందోబస్తు మధ్య మ్యాచ్ కొనసాగింది. స్టేడియం సామర్థ్యానికి మించి ఎక్కువమంది మ్యాచ్ చూసేందుకు రావడం కూడా ఫ్యాన్స్ ఆందోళనకు కారణం అని తెలిసింది. ఫ్యాన్స్ రాళ్లు రువ్వుతున్న వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.
ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు
ఆందోళన సద్దుమణిగిన తర్వాత మ్యాచ్ ప్రారంభం అయింది. బాబార్ ఆజాం కెప్టెన్సీలోని క్వెట్టా గ్లాడియేటర్స్, సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోని పెషావర్ జల్మి జట్లు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదాడు. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో అతను ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపించాడు. అతను 50 బంతుల్లోనే 94 రన్స్ చేశాడు. దాంతో క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ 3 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ ఫిబ్రవరి 13న మొదలుకానుంది. కరాచీ, లాహోర్, ముల్తాన్, రావల్పిండిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 19న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.
Reports of multiple injuries in a bomb blast in highly secure area of Quetta near the Police headquarters and entrance of Quetta Cantonment. The city is under strict security due to a PSL cricket match. pic.twitter.com/lZcfn1VQRU
— The Balochistan Post – English (@TBPEnglish) February 5, 2023
افواہوں پر یقین نہ کریں۔ گراؤنڈ میں جگہ کی کمی کی وجہ سے پتھراؤ کی وجہ سے میچ روک دیا گیا ہے #PZvQG #QGvPZ @iamqadirkhawaja @iihtishamm pic.twitter.com/83QxKRicUl
— GC ShAhAb KhAn ( AfRiDi ) (@ShabiSpeaks) February 5, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

