వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌కు మద్దతుగా కొన్ని చోట్ల, అమెరికాకు అనుకూలంగా మరికొన్ని చోట్ల, యుద్ధం ముగించాలంటూ ఇంకొన్ని చోట్ల ఆందోళనలు నిర్వహించారు. ఇరాన్‌పై అమెరికా-ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో వేలాది మంది నిరసన ప్రదర్శన చేపట్టారు.
యెమెన్‌లోని సనాలో హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులు అమెరికా జెండాలను తగులబెట్టి నిరసన తెలిపారు. లెబనీస్, పాలస్తీనియన్, ఇరానియన్, హెజ్బొల్లా జెండాలను ఊపుతూ అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తుర్కియేలోని అంకారాలో అమెరికా ఎంబసీ ముందు పలువురు నిరసన చేపట్టారు. పశ్చిమాసియా నుంచి అమెరికా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. లీవ్ నాటో అంటూ నినదించారు. లండన్‌లో కొంతమంది నిరసనకారులు ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఇక జర్మనీలో పలువురు నిరసనకారులు మార్చ్ నిర్వహించారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.