Insulin | న్యూయార్క్, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్ కొరతను పరిష్కరించేందుకు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయో గం చేపట్టారు.
బ్రెజిల్‌లోని బ్రౌన్ బొవైన్ అనే రకం ఆవును జన్యుమార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్‌ను సేకరించారు. ఇలా జన్యుమార్పిడి చేసిన ఒక ఆవు పాలలో మనుషులకు ఉపయోగపడే ప్రొఇన్సిలిన్, ఇన్సులిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.