Space Station | 8.5 లక్షల కోట్లతో.. ప్రైవేటు అంతరిక్ష కేంద్రం నిర్మిస్తున్న జెఫ్ బెజోస్
అంతరిక్ష వాణిజ్యంలో అపర కుబేరుల హవా నడుస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్య నుంచి సురక్షితంగా తొలగించే కాంట్రాక్టును ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ దక్కించుకోగా, కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తీసుకుంది.
- నిర్మిస్తున్న ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ
- పర్యాటకులకు విడిదిగానూ వినియోగించేలా రూపకల్పన
Space Station | న్యూయార్క్, డిసెంబర్ 5 : అంతరిక్ష వాణిజ్యంలో అపర కుబేరుల హవా నడుస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్య నుంచి సురక్షితంగా తొలగించే కాంట్రాక్టును ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ దక్కించుకోగా, కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కాలపరిమితి ముగుస్తున్నది. 2031 నాటికి ఐఎస్ఎస్ కార్యకలాపాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను బ్లూ ఆరిజిన్ సంస్థకు నాసా అప్పగించింది. ఆర్బిటల్ రీఫ్ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త అంతరిక్ష కేంద్రం 8,200 క్యూబిక్ అడుగుల స్థలంలో ఉంటుంది. ఇది మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష కేంద్రంగా నిలవనుంది. 2027లో దీనిని ప్రయోగించాలని, 2030 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
అంతరిక్ష పర్యాటకులకూ..
ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.8.5 లక్షల కోట్లను బ్లూ ఆరిజిన్ సంస్థ ఖర్చు చేయనున్నది. సయెర్రా స్పేస్, అమెజాన్, బోయింగ్ వంటి సంస్థలతో కలిసి ఈ సంస్థ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న అంతరిక్ష కేంద్రాలు కేవలం వ్యోమగాముల కోసం మాత్రమే వినియోగించారు. ఈ కొత్త కేంద్రాన్ని మాత్రం భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకులకు విడిదిగానూ వినియోగించేలా నిర్మిస్తున్నారు. మొదట 10 మందికి సరిపోయే స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత మరింత విస్తరించనున్నారు. భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ స్పేస్ స్టేషన్‌కు భారీ కిటికీలు ఉంటాయని, అక్కడి నుంచి భూమిని వీక్షించవచ్చని బ్లూ ఆరిజిన్ సంస్థ తెలిపింది. వ్యక్తిగత, వ్యాపార వినియోగానికి వీలుగా ప్రత్యేక క్వార్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, సురక్షితమైన, ఉత్తేజభరితంగా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రాతో మొదలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

