జకార్తా, డిసెంబర్ 2: పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియా కొత్త చట్టం తేబోతున్నది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయ్యింది. త్వరలోనే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గతంలోనూ దీనిపై డ్రాఫ్ట్ బిల్లును తీసుకురాగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు తెలిపారు.
దాంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొన్నది. తాజాగా, కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీనిపై ఆ దేశ డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ మాట్లాడుతూ.. ఇండోనేషియా విలువలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు.