Prince William | రాజకుటుంబ అంశాలు అర్థం కావడం కష్టమే.. తేల్చి చెప్పిన ప్రిన్స్ విలియమ్
Prince William | బ్రిటన్ భవిష్యత్ రాజ కుటుంబ వారసుడు ప్రిన్స్ విలియమ్.. తమ రాజ కుటుంబ అంశాలు బయటి వారికి అర్థం కావడం చాలా కష్టం అని వ్యాఖ్యానించారు.
Prince William | బ్రిటన్ రాజకుటుంబంలో జరిగే ఘటనలన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం, ప్రిన్స్ హ్యారీ రాసిన పుస్తకం, రాజుగా చార్లెస్ పట్టాభిషేకం వంటి ఘటనలతో ఇటీవల బ్రిటన్ రాజకుటుంబం పేరు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. భవిష్యత్ బ్రిటన్ రాజు ప్రిన్స్ విలియం మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు ప్రిన్స్ హ్యారీతో విభేదాలను బయట పెట్టారు.
తమ కుటుంబంపై ఊహించిన దానికంటే ఎక్కువ చర్చ జరిగిందని, వివాదాలు ఉన్నా రాజ కుటుంబ సభ్యులు ప్రజాసేవకు, సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి అంకిత భాంతో ఉన్నారని ప్రిన్స్ విలియం చెప్పుకొచ్చారు. రాజకుటుంబ విషయాలు బయటి వ్యక్తులకు అర్థం కావడం కష్టం, తమ సామాజిక కార్యక్రమాలతో హ్యారీతో వివాదం ప్రజల దృష్టి నుంచి తప్పిపోయిందన్నారు. భవిష్యత్ బ్రిటన్ రాజకుటుంబ సింహాసన వారసుడిగా తాను తన తల్లి ప్రిన్సెస్ డయానా అడుగు జాడల్లో నిరాశ్రయుల సమస్య పరిష్కారానికి తమ ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నామన్నారు.
బ్రిటన్ రాజకుటుంబ వారసుడిగా తన అనుభవాలపై ప్రిన్స్ హ్యారీ.. `స్పేర్` అనే పేరుతో రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం సంచలనం సృష్టించింది. తననెప్పుడూ `స్పేర్`గానే చూశారని హ్యారీ రాసుకున్నారు. తన సోదరుడు విలియంతో గొడవ జరిగిందని, మేఘన్ మెర్కెల్‌తో పెండ్లి విషయంలో కుటుంబంతో విభేదాలు తలెత్తాయని చెప్పారు. వివాహం తర్వాత మేఘన్‌ను రాజకుటుంబం తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

