హెచ్1బీ ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం
2024-25 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పించనున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది.
- ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ద్వారా దాఖలు చేసే సౌలభ్యం
వాషింగ్టన్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేసేందుకు ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పించనున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కూడా హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ కొలాబరేషన్, సబ్మిషన్లకు అవకాశం కల్పించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అకౌంట్ లభ్యత, రిజిస్ట్రేషన్ తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలాఖరునాటికి వెలువడే అవకాశం కనిపిస్తున్నది.
పరిమితి లేని ఫైలింగ్స్, 2025 ఆర్థిక సంవత్సరం పరిమితి సీజన్ కోసం ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రారంభించబోతున్నట్లు యూఎస్సీఐఎస్ ప్రకటించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ కోసం సమన్వయంతో పని చేసి, తయారుచేసే అవకాశం ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌లో కంపెనీ లేదా ఇతర వ్యాపార సంస్థల్లోని వ్యక్తులకు, వారి లీగల్ రిప్రజెంటేటివ్‌లకు ఉంటుందని తెలిపింది. నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ కోసం దరఖాస్తు ఫారం ఐ-129 అని, ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్ కోసం విజ్ఞప్తి కోసం ఫారం ఐ-907 అని తెలిపింది. ఈ ఫారాలను ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ద్వారా ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు.
ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కోసం లీగల్ రిప్రజెంటేటివ్‌కు అధికారం ఇవ్వవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కాగితంపై ముద్రించి, రాసిన ఫారం ఐ-129ను కూడా దాఖలు చేయవచ్చు. అయితే హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. యూఎస్సీఐఎస్ ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో రెండు నేషనల్ ఎంగేజ్మెంట్ సెషన్స్‌ను నిర్వహిస్తుంది. హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ పీరియడ్‌కు ముందే ఈ ప్రక్రియను ఏ విధంగా పూర్తి చేయాలో ఆర్గనైజేషన్లకు, వాటి లీగల్ రిప్రజెంటేటివ్‌లకు వివరిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

