వాషింగ్టన్, సెప్టెంబర్ 20: తమ కరోనా వ్యాక్సిన్ 5-11 ఏండ్ల పిల్లలపై కూడా సమర్థంగా పనిచేస్తున్నదని ఫైజర్ సోమవారం వెల్లడించింది. ‘పెద్దల్లో మాదిరే పిల్లల్లో కూడా యాంటిబాడీలు ఉత్పత్తి అయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదు. ఈ వయసు వారికి ఫైజర్ టీకాలు వేయడానికి త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోరుతాం’ అని తెలిపింది.