తుపాకీతో వ్యక్తిని కాల్చి చంపిన శునకం..!
అమెరికాలో ఓ వ్యక్తిని కుక్క తుపాకీతో కాల్చింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Viral News | కుక్క తుపాకీ కాల్చడాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? లేదు కదూ! అయితే అమెరికాలో ఓ వ్యక్తిని కుక్క తుపాకీతో కాల్చి చంపింది. విచిత్రంగా ఉంది కదూ. మీరు విన్నది నిజమే. అయితే అది కావాలని చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది.
అమెరికాలోని (US state) కాన్సాస్ (Kansas)లో నివాసం ఉండే 30 ఏళ్ల వ్యక్తి.. శనివారం తన పెంపుడు కుక్కతో కలిసి వేటకు వెళ్లాడు. పికప్ వ్యాన్‌లో అతడు డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. వెనకాల కుక్కను కూర్చోబెట్టాడు. అక్కడే లోడ్ చేసిన తన తుపాకీని కూడా ఉంచాడు. కాగా, వెనకాల ఉన్న కుక్క అటూ ఇటూ తిరుగుతూ.. తుపాకీ ట్రిగ్గర్‌పై కాలు పెట్టింది. అంతే.. క్షణాల్లో తుపాకీ పేలి అందులోనుంచి దూసుకువచ్చిన గుండు ముందు సీటులో కూర్చున్న యజమానికి తగింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, యునైటెడ్ స్టేట్స్లో కాల్పులు జరగడం సర్వసాధారణమే. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. 2021 ఏడాదిలో కేవలం తుపాకీ ప్రమాదాల్లో 500 మందికి పైగా మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Hunting Trip
- pet dog
- shoots
- US man
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

