Aliens | లిమా, ఆగస్టు 13: ఏలియన్స్‌ను చూశామని, అవి తమపై దాడి చేశాయని పెరూ దేశంలోని ఓ గ్రామస్థులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఏడడుగుల ఎత్తున్న ఏలియన్స్ చేత్తో ఆయుధాలు పట్టుకొని స్పైడర్‌మ్యాన్ సినిమాలో ఉండే గ్రీన్ గోబ్లిన్ తరహాలో ఉన్నాయని ఆ గ్రామస్థులు పేర్కొంటున్నారు.
అయితే ఆ గ్రామస్థుల ఆరోపణలను స్థానిక అధికారులు ఖండించారు. బంగారం మైనింగ్ జరిగే ప్రాంతాలకు గిరిజనులు వెళ్లకుండా ఉండేందుకే, వారిని భయపెట్టాలనే ఉద్దేశంతో ఇలా ఏలియన్స్ రూపంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.