Watch: మంటల్లో కాలిపోయిన బస్సు.. తృటిలో బయటపడిన ప్రయాణికులు
Bus Catches Fire | ఒక హైవేపై వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి (Bus Catches Fire). అప్రమత్తమైన డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో ఆ బస్సు మంటల్లో కాలిపోయింది.
బ్యూనస్ ఎయిర్స్: ఒక హైవేపై వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి (Bus Catches Fire). అప్రమత్తమైన డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం జనరల్ పాజ్ హైవే పలు వాహనాలతో రద్దీగా ఉన్నది. ఇంతలో ఒక డబుల్ బస్సు ఆ హైవేపై వెళ్తున్నది.
కాగా, ఆకస్మాత్తుగా బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఆ బస్సును రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో అందులోని ప్రయాణికులు వెంటనే బయటకు వచ్చారు. అనంతరం కొన్ని నిమిషాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. అలాగే హైవేపై కూడా మంటలు వ్యాపించాయి. రెండు కార్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. కొంత సేపటికి ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
మరోవైపు ఆ హైవేపై ఉన్న సీసీటీవీలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. అర్జెంటీనా పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటం, ఎవరికీ ఏమీ కావపోవడం అదృష్టమని కొందరు పేర్కొన్నారు.
Watch a bus catch on fire in Argentina #bus #busfire #argentina pic.twitter.com/qxLlALdHFp
— UpToDate (@UpToDateNewsSvc) August 16, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

