Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాద బాధితుడి పేరెంట్స్‌కు 100 మిలియన్ల డాలర్ల పరిహారం
Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాద బాధితుడి పేరెంట్స్‌కు 100 మిలియన్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని అమెరికాలోని నెవడా కోర్టు ఆదేశించింది. 2018లో బ్రిటన్‌కు చెందిన ఓ బాధితుడు ఆ ప్రమాదంలో మరణించాడు. ఆ బాధితుడి పేరెంట్స్ పరిహారం ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
టెక్సాస్: అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ కేనియన్ పర్యాటక ప్రదేశంలో అయిదేళ్ల క్రితం హెలికాప్టర్ కూలిన(Helicopter Crash) ఘటనలో అయిదుగురు మృతిచెందారు. అయితే ఆ బాధితుల్లో ఒకరి పేరెంట్స్‌కు భారీ నష్టపరిహారాన్ని చెల్లించనున్నారు. సుమారు వంద మిలియన్ల డాలర్లు ఇవ్వాలంటూ ఆ హెలికాప్టర్ నిర్వాహాకులకు నెవడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జోనాథన్ ఉడాల్ అనే వ్యక్తి తన భార్య, మిత్రులతో కలిసి నెవడా టూర్‌కు వెళ్లారు. బర్త్ డే సంబరాల్లో విషాదం చోటుచేసుకున్నది. గ్రాండ్ కేనియన్లో విహరిస్తున్న సమయలో ఆ విమానం కూలింది. ఈ కేసులో నెవడా కోర్టు తీర్పును ఇచ్చింది. జోనాథన్ పేరెంట్స్‌కు వంద మిలియన్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. హెలికాప్టర్ ఆపరేట్ చేసిన పాపిలియన్ ఎయిర్వేస్ కంపెనీ 25 మిలియన్ల డాలర్లు, ఆ విమానం ఉత్పత్తి చేసిన ఎయిర్‌బస్ హెలికాప్టర్ సంస్థ 75 మిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

