మీ పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టు ఎంత పొడవుంటుంది? ఓ పది, పన్నెండు అడుగులు ఉంటుంది కదా.. కానీ బ్రెజిల్‌లోని టార్సీసియో అనే వ్యక్తి ఇంట్లో చెట్టు మాత్రం ఏకంగా 47 అడుగుల ఎత్తు పెరిగిందట.
కచ్చితంగా చెప్పాలంటే 47 అడుగుల 8.83 అంగుళాల ఎత్తు. ఇంకేం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బొప్పాయి చెట్టుగా ఇది గిన్నెస్ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు 46 అడుగుల 2.33 అంగుళాల ఎత్తుతో భారత్‌కు చెందిన జంటూ పాల్ అనే వ్యక్తి చెట్టు రికార్డుల్లో ఉండేది.