UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ ఔట్.. మరో ఐదు దేశాలకు కొత్తగా చోటు
UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది.
UNSC : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాదితో ముగియనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశాలకు సంబంధించిన ఓటింగ్ ఈ నెల 3న జరిగింది. దీని ప్రకారం పాకిస్తాన్ సహా ఐదు దేశాలు తమ సభ్యత్వం కోల్పోనున్నాయి. మరో ఐదు దేశాలు కొత్తగా అడుగుపెట్టబోతున్నాయి. అందులో ఇస్లాం దేశమైన కిర్గిస్తాన్.. భద్రతా మండలిలోకి తొలిసారి అడుగుపెట్టబోతుంది. దీనితోపాటు ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు రెండేళ్ల కాలపరిమితితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం దక్కించుకున్నాయి.
పాకిస్తాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. దీంతో భద్రతా మండలిలో ఈ దేశానికి ఇకపై ప్రాతినిధ్యం ఉండదు. పాక్‌తోపాటు పనామా, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా దేశాలు కూడా ఈ ఏడాదితో సభ్యత్వాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీటి సభ్యత్వం పూర్తవుతుంది. కొత్తగా రానున్న దేశాల సభ్యత్వం జనవరి 1, 2027 నుంచి డిసెంబర్ 31, 2028 వరకు కొనసాగుతుంది. భద్రతా మండలిలో కొత్తగా ఐదు దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఇందుకోసం ఏడు దేశాలు పోటీ పడ్డాయి. వీటిలో ఆస్ట్రియా, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వేలు నాలుగు స్థానాల్లో నిలిచాయి. మిగిలిన ఒక్క స్తానం కోసం కిర్గిస్తాన్, ఫిలిప్పైన్స్ మధ్య ఉత్కంఠ పోటీ నడిచింది. ఈ రెండు దేశాల సభ్యత్వం కోసం అదనంగా మూడు రౌండ్ల పోటీ నిర్వహించాల్సి వచ్చింది.
చివరకు కిర్గిస్తాన్ గెలిచి, తొలిసారి సభ్యత్వం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఐదు స్థానాల కోసం పోటీ పడే ప్రతి దేశం కనీస మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలి. సభ్య దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. భద్రతా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారు. ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. అంతర్జాతీయంగా దేశాల మధ్య శాంతి భద్రతల్ని కాపాడటానికి, రక్షణ కోసం భద్రతా మండలి పని చేస్తుంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

