ఇస్లామాబాద్, అక్టోబర్ 13: పాకిస్థాన్లో ప్రతి రెండు గంటలకు ఒక లైంగికదాడి జరుగుతున్నది. 2017-2021 మధ్య దేశవ్యాప్తంగా 21,900 మందిపై లైంగికదాడి జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. దీనిబట్టి ప్రతి రోజు 12 మంది లైంగికదాడికి గురవుతున్నట్టు తెలుస్తున్నది.
2017లో 3,327 రేప్ కేసులు వెలుగుచూడగా.. 2021లో 5,169 కేసులు నమోదయ్యాయి.