US-Iran Talks | ఇరాన్-అమెరికా చర్చలు జరిగిన హోటల్ బిల్లు కూడా చెల్లించలేని పాకిస్తాన్!
US-Iran Talks : ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు వేదికగా నిలిచిన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ అవమానం పాలైంది.
US-Iran Talks : ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు వేదికగా నిలిచి, ప్రపంచం ముందు గొప్పలు పోతున్న పాకిస్తాన్ అసలు వ్యవహారం ఇప్పుడు బయటపడింది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా చెల్లించలేక ప్రపంచం ముందు అవమానం పాలైంది. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్ వేదికగా ఇటీవల శాంతి చర్చలు జరిగాయి. ఏప్రిల్ 10-12 వరకు ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనా వేదికగా శాంతి చర్చలు జరిగాయి.
దీనికి ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. వీరికి పాక్ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. అంటే, ఇక్కడి ఆతిథ్య ఖర్చుల్ని పాక్ భరించాలి. ఇక.. ఈ చర్చలు విఫలమైన సంగతి కూడా తెలిసిందే. ఈ చర్చలు నిర్వహించడం ద్వారా ప్రపంచం ముందు తాము ఈ ప్రాంతంలో మధ్యవర్తిత్వం వహించగల సత్తా ఉన్న దేశంగా చాటింపు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్‌ను పొగిడాడు. పాక్ ప్రధాని షెహబాజ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇంతఖ్యాతి పొందిన పాకిస్తాన్ ఇప్పుడు ఇదే విషయంలో ప్రపంచం ముందు అభాసుపాలైంది. ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లుల్ని కూడా పాక్ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. హోటల్ బిల్లు చెల్లించాలని, హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సంస్థ డిమాండ్ చేస్తోంది.
ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇరాన్-అమెరికా మధ్య చర్చల అంశంలో కీలక బాధ్యత తీసుకున్న పాకిస్తాన్.. ఆ విషయంలో కనీస గౌరవాన్ని కాపాడుకోలేకపోయింది. హోటల్ బిల్లులు కూడా చెల్లించలేక తన ధీన ఆర్థిక స్థితిని బయటపెట్టుకుంది. ద్వైపాక్షిక అంశాల విషయంలో ఏదో సాధించేసి ప్రపంచం ముందు సత్తా చాటాలని ఆసక్తి ఉన్నా.. పాపం హోటల్ బిల్లులు చెల్లించలేని దిక్కుమాలిన ఆర్థికి స్థితిలో పాక్ ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

