Artificial Rain | పాక్‌లో తొలిసారి కృత్రిమ వర్షం.. పొల్యూషన్‌ను తగ్గించేందుకే..!
Artificial Rain | యాదాది దేశంలో పాకిస్తాన్లో తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. క్లౌడ్ సీడింగ్ పరికరాలతో కూడిన విమానాలు లాహోర్ కృత్రిమ వర్షం కురిపించినట్లు తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో లాహోర్ సైతం ఉన్నది.
Artificial Rain | యాదాది దేశంలో పాకిస్తాన్లో తొలిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. క్లౌడ్ సీడింగ్ పరికరాలతో కూడిన విమానాలు లాహోర్ కృత్రిమ వర్షం కురిపించినట్లు తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో లాహోర్ సైతం ఉన్నది. వాయు కాలుష్యం నేపథ్యంలో పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం కృత్రిమ వర్షంపై దృష్టి పెట్టింది. 48 ఫ్లేర్స్‌తో కూడిన రెండు విమానాలను యూఏఈ పంపగా.. వాటి సహాయంతో వర్షం కురిపించింది. ఐక్యూ ఎయిర్ ప్రకారం.. డిసెంబర్ 18 నాటికి లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 192గా ఉన్నది.
కృత్రిమ వర్షం అంటే..
కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా పిలుస్తుంటారు. రసాయనాల సహాయంతో మేఘాలపై చల్లడం ద్వారా అవి వర్షాన్ని కురిపిస్తాయి. దీన్నే కృత్రిమ వర్షమని పిలుస్తుంటారు. అయితే, ఇది సులభమైన ప్రక్రియ కాదు. దానికి అనుమతి అవసరం ఉంటుంది. చాలా దేశాలు అత్యవసరమైన సమయంలో కృత్రిమ వర్షాలు కురిపిస్తుంటాయి. ప్రపంచంలో తొలిసారిగా 1945లో కృత్రిమ వర్షం అనే కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దీన్ని 50 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారతదేశంలో 1951లో తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించారు. ఆ తర్వాత 1973లో ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు తలెత్తడంతో సాంకేతికను వినియోగించగా.. ఆ తర్వాత కర్నాటక, తమిళనాడులోనూ ప్రక్రియను అవలంభించారు. చైనాలో 2008లో బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహించి.. వర్షాన్ని కురిపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

