Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊరట.. 12 కేసుల్లో బెయిల్ మంజూరు..!
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్ ఇచ్చింది.
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్, షా మెహమూద్ ఖురేషీలకు బెయిల్ సీహెచ్ఈ, ఆర్మీ మ్యూజియం దాడులకు సంబంధించిన కేసుల్లో పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాజ్ ఆసిఫ్ బెయిల్‌ను మంజూరు చేశారు.
ఇమ్రాన్ ఖాన్‌ను కస్టడీలో ఉంచడంలో అర్థం లేదని.. ఎందుకంటే మే 9న నిందితులందరికీ బెయిల్ మంజూరైందన్నారు. ఇమ్రాన్, ఖురేషీలను ఫిబ్రవరి 6న దోషులుగా నిర్ధారించారు. ఇద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన తర్వాత మే 9న దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.
గురువారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతున్నది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్) అధినేత నవాజ్ షరీఫ్ లండన్ ప్లాన్ ఓటింగ్ విఫలమైందని ఆయన అన్నారు. తన మిత్రపక్షాలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్), ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (పాకిస్థాన్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

