అమెరికా జోక్యం ఏమాత్రం లేదు.. ఇమ్రాన్‌తో విభేదించిన పాక్ ఆర్మీ
తన ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా ప్రయత్నిస్తోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఆర్మీ ఖండించింది. పాక్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా హస్తం ఏమాత్రం లేదని ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికాతో సత్సంబంధాలు నెరపాలన్నదే తమ అభిమతమని ఆర్మీ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దేశంలో వచ్చిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో కూడా ఏలాంటి దౌత్య పరమైన కారణాలు లేవని పాక్ ఆర్మీ స్పష్గం చేసింది. పాక్ ప్రభుత్వానికి అమెరికా ఎలాంటి లేఖలూ పంపలేదని కూడా సైన్యం ప్రకటించింది.
తనను గద్దె దింపేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్ర పన్నిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు. ఇమ్రాన్‌ను తొలగించాలని, లేదంటే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వుంటుందని అమెరికా ఓ లేఖ పంపిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నడుస్తున్న సమయంలో తాను మాస్కోలో పర్యటించడం ఇష్టం లేకే.. ఓ దేశం కుట్ర పన్నిందని ఇమ్రాన్ అమెరికాపై మండిపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- imran govt
- pak army
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

